https://www.facebook.com/share/v/1EKMgRGTtQ
Telangana CM, Revanth Reddy, Social Justice Party, KV Goud, Open Letter to CM, Telangana Politics, Telangana Government, Political News, Social Justice in Telangana, Public Letter to CM, Telangana State Updates, Revanth Reddy News, Telangana Administration, Political Awareness, Social Reforms
]]>బీసీలకిచ్చిన హామీ లను నెరవేరుస్తాము -తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ.
-దీపాదాస్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన బీసీ ఇంటలెక్ష్వల్ ఫోరమ్ నేతలు
కాంగ్రెస్ పార్టీ బీసీల కిచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొంటుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీ లకు ఇచ్చిన హామీలు అమలుకై
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి దీపాదాస్ మున్షీ కి బిసి ఇంటలెక్చువల్ ఫోరమ్ ప్రతినిధులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సోషల్ జస్టిస్ పార్టీ నేతలు మంగళవారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో కలిసి ఈ వినతి పత్రం ఇచ్చారు. నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమన్వయంతో ఈ వినతి పత్రం ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా బిసి ఇంటలెక్చువల్ ఫోరమ్ అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి.చిరంజీవులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కులగణన అంశంపై మాట్లాడుతున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ఆ ప్రక్రియ చేపట్టాలని దీపాదాస్ ను కోరారు. ఈ డబ్ల్యు ఎస్ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని తెలిపారు. స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తోందని కూడా చెప్పారు.
ఆమెను కలిసిన వారిలో ఫోరమ్ ప్రతినిధులు ప్రొ. ఇనుకొండ తిరుమలి, సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి కే వి గౌడ్, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు
కిరణ్ కుమార్ గౌడ, బిక్కి ప్రధాన కార్యదర్శి దాసరి కిరణ్, సంచార జాతుల సంఘం అధ్యక్షుడు ఒంటెద్దు నరెందర్, బీసీ సమాజ్ అధ్యక్షుడు సంగెం సూర్యారావు. బీసీ జెఎసి అధ్యక్షుడు అవ్వారు వేణు, బత్తిని కీర్తిలత గౌడ్, గౌలికర్ నర్సింగ్, మురళీ తదితరులు ఉన్నారు.
We will fulfill the promises made to the BCs - Telangana State Congress Party in-charge Deepadas Munshi.]]>
- Leaders of BC Intellectual Forum who submitted the petition along with Deepadas
Telangana State Congress Party in-charge Deepadas Munshi said that the party leadership will take steps to fulfill the promises made by the BCs of the Congress party.
The assurances given to the BCs in the name of the Congress Party's Kamareddy Declaration are to be implemented
The representatives of BC Intellectual Forum, MLC Theenmar Mallanna, asked Congress Party Telangana State Incharge Deepadas Munshi to order the State Chief Minister Revanth Reddy. Social Justice Party leaders gave this petition together at her residence in Banjara Hills, Hyderabad on Tuesday morning. Nalgonda Warangal Khammam Graduate MLC Tinmar Mallanna coordinated this petition and handed it over to her.
On this occasion, President of BC Intellectual Forum retired IAS officer T. Chiranjeevulu said that the Congress party is talking about the issue of caste census at the national level and asked Deepadas to take up the process immediately in Telangana state which is in power. It has been explained that because of this WC reservation, the state is doing injustice to BC, SC and ST. Speaking to the representatives who met her on this occasion, she said that the party will implement the promises made before the elections. He also said that 42 percent reservation is being given to BCs in local bodies.
Among those who met her were representatives of the forum Prof. Inukonda Tirumali, Social Justice Party President Chamakura Raju, Telangana State Incharge KV Goud, Allindia OBC Students Association President
Kiran Kumar Gowda, Bikki General Secretary Dasari Kiran, Onteddu Narendra, President of Nomadic Society, Sangem Surya Rao, President of BC Samaj. BC JAC president Avvaru Venu, Battini Kirtilatha Goud, Goulikar Narsingh, Murali and others were present.
*””బీసీల అమరణ దీక్ష””* ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం “సంచార ఆమరణ దీక్ష” గా మార్చింది.
1. మొదటి రోజు హైదర్ గూడ, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో కొనసాగగా,
2. రెండవరోజు మల్లంపేట్, యల్ బి నగర్, నాగోల్ పోలీస్ స్టేషన్ లో జరిగింది.
3. మూడవరోజు దుండిగల్ మండలం, గాగిల్లా పురులో బత్తుల సిద్దేశ్వర్ పటేల్ ఇంటిలో బత్తుల సిద్దేశ్వర్ పటేల్ మరియు సంజయ్ కుమార్ నేత ఇద్దరు, వరంగల్ జిల్లా గీసుకొండలో వారి ఇంటి వద్ద చాపర్తి కుమార్ మూడవ రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింది.
4. నాలుగవ రోజు గాంధీ హాస్పిటల్ కు చేరిన బీసీల ఆమరణ నిరాహార దీక్ష బత్తుల సిద్దేశ్వర పటేల్, జక్కలి సంజయ్ కుమార్ నేత గాంధీ ఆసుపత్రిలో తమ దీక్షను కొనసాగిస్తుండగా చాపర్తి కుమార్ గాడ్గే తన నాల్గవ రోజు దీక్షను వరంగల్ జిల్లా గీసుకొండ లోని తన స్వగృహంలో కొనసాగించారు.
5. ఐదో రోజు దీక్ష గాంధీ ఆసుపత్రిలో బత్తుల సిద్దేశ్వర పటేల్, జక్కలి సంజయ్ కుమార్ నేత, వరంగల్ జిల్లా గీసుకొండ లోని తన స్వగృహంలో చాపర్తి కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. గాంధీ ఆస్పత్రిలోని బత్తుల సిద్దేశ్వర్ పటేల్, జక్కని సంజయ్ కుమార్ నేతలను MLC మాజీ స్పీకర్ మధుసూదన చారి, వి.హనుమంతరావు, బూర నర్సయ్య గౌడ్, రాజారామ్ యాదవ్, చామకూర రాజు, కె వి గౌడ్, బొంగు ప్రసాద్, అవ్వారు వేణు తదితర నాయకులు పరామర్శించారు. వరంగల్ లో దీక్ష చేస్తున్న చాపర్తి కుమార్ గాడ్గే ను వివిధ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు పరామర్శించారు.
6. ఆరవ రోజు దీక్ష గాంధీ ఆసుపత్రిలో బత్తుల సిద్దేశ్వర పటేల్, జక్కలి సంజయ్ కుమార్ నేత, వరంగల్ జిల్లా గీసుకొండ లోని తన స్వగృహంలో చాపర్తి కుమార్ గాడ్గే ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు…
MLC and Ex Speker Madhusudana Chary| V Hanumantha Rao| Burra Narsaiah Goud| Social Justice Party Of India
]]>*హైదరాబాదులో దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు సంఘీభావం!*
*మంచిర్యాలలో బీసీ సంఘాల నిరసన ప్రదర్శన!!*
తేది: 30.08.2024
తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపిన తర్వాతనే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ బీసీ సంఘాల జేయేసి నాయకులు డిమాండు చేసారు. హైదరాబాదులో ఆమరణ దీక్ష చేపట్టిన బీసీ నాయకులకు మద్దతుగా శుక్రవారం రోజున మంచిర్యాల జరిగిన సంఘీభావ ప్రదర్శనలో వారు పాల్గొని ప్రసంగించారు. మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. అధికారం లోకి వచ్చిన వెంటనే కుల జనగణన చేస్తామని, BC వర్గాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన పిదప కుల గణన హామీ ఇప్పటివరకు అమలు జరపలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇది ప్రజల కిచ్చిన హామీనిభంగ పరచడమేనని బీసీ నాయకులు విమర్శించారు.
ఇట్టి విషయమై ప్రభుత్వం పునరాలోచన చేసి బీసీ జన గణన సత్వరం చేపట్టాలని బీసీ ఐక్య కార్యాచరణ కమిటి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో కుల జనగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతనే స్థానిక సంస్థల పన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులో దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు ఒప్పించి దీక్ష విరమింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, బీసీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ బీసీ నాయకులు శ్రీరామోజు కొండయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు, యువజన సంఘం నాయకులు గద్దెర్ల చంద్రకాంత్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నస్పూరి అఖిల్, అర్కాల ఓదెలు, పద్మశాలి సంఘం నాయకులు నాగరాజు, వేముల మల్లేశం, అడిచర్ల రాజయ్య, సోమన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Supported by : Social Justice Party Of India
]]>Hindu BC Mahasabha President Battula Siddeshwara Patel, BC Azad Youth Federation President Jakkili Sanjay Kumar, Rajya Sabha members visited National BC Welfare Society President R Krishnaiah, Former IAS officer BC Intellectualpuram founder Chiranjeevi garu, Social Justice Party President Chamakura Raju garu garu visited that party State Incharge KV Goud BC Janasabha President Rajaram Yadav, BC Welfare Association President Jajula Srinivas garu BC Azadi Song President Desagoni Mahesh Goud Hindu BC Azad Sangham President Kongara Narahari and others. BC Hunger Strike – Social Justice Party Of India
కులగణన సాధించేవరకు పోరాటం చేస్తాం | Chamakura Raju (Pidikili Raju) Interview | Social Justice Party
కులగణన సాధించేవరకు పోరాటం చేస్తాం | Chamakura Raju (Pidikili Raju) Interview | Social Justice Party Of India | Social Justice Party
కులగణన సాధించేవరకు పోరాటం చేస్తాం | Chamakura Raju (Pidikili Raju) Interview | Social Justice Party Of India | Social Justice Party
]]>ఈరోజు హైదరాబాద్‌లోని సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో, చామకూరు రాజు అధ్యక్షతన మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్,స్టేట్ కో కన్వీనర్ కేవీ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నియామకాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చామకూరు రాజు మాట్లాడుతూ, తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్‌గా రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన వరిపల్లి అనిల్ కుమార్‌ను నియమించినట్లు ప్రకటించారు.
వరిపల్లి అనిల్ కుమార్ తన నియామకాన్ని స్వీకరిస్తూ, సోషల్ జస్టిస్ పార్టీ యువతను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను పరిష్కరించడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన చామకూరు రాజు, శ్రీకాంత్, కె.వి గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పదవిని సక్రమంగా నిర్వహించి, సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ముందుండి పోరాడతానని ప్రకటించారు. అదేవిధంగా, సమాజంలో ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా కోరారు.
]]>బిసి కుల గణన చేయాల్సిందే | T Chiranjeevulu, Retd IAS Full Interview | BC Intellectuals Form | BC Badi| Social Justice Party Of India
]]>బిసిలకు అధికారం కొరకే బిసి బడి | KV Goud Interview | BC Badi Classes | BC Times
]]>*కుల గణన భారతీయ సమాజానికి ఒక ఎక్స్ రే*
టి.చిరంజీవులు.ఐఏఎస్ retd
కుల గణన, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు 2024 లోకసభ ఎన్నికల్లో జాతీయ ప్రాధాన్యత అంశాలుగా మారాయి. నిజానికి భారతీయ సమాజం కులాల సమాహారం. బ్రిటిష్ పాలలో 1881 నుంచి 1931 వరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కలలో కులాలవారీగా జనాభా గణన చేశారు. నిజాం సంస్థానంలో కూడా కుల గణన జరిగింది. కాని స్వతంత్ర భారతంలో 1951 నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్న జనాభా లెక్కల సేకరణలో యస్ సి మరియు యస్ టి ల వి తప్ప మిగతా కులాల లెక్కలు సేకరించడం లేదు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ1951 సెన్సస్ లో కులగణనకు సమ్మతించలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ డిమాండ్ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ బిజెపి పార్టీలు గతంలో కుల గణనకు ఒప్పుకొని యూటర్న్ తీసుకుని ఓబిసి లకు అన్యాయం చేసినవే.
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న ఓబిసి రిజర్వేషన్లను 23 నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది. మరి నేడు కుల గణన లేకుండా రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. మరొకసారి బి సి లు మోసపోవాల్సిందేనా? మౌనముగాచూస్తూ ఉండాల్సిందేనా?
*కుల గణన ఎందుకు చేయాలి?*
ఇది అట్టడుగు వర్గాల సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వెనుకబాటుతనాన్ని బట్ట బయలు చేసే ఒక ఎక్స్ రే.
1. *కుల గణన ఒక సామాజిక అవసరము:* – భారతీయ సమాజంలో కులం అనేది ఒక వాస్తవికత . కులం,కుల వ్యవస్థ, కుల వృత్తులు, కుల సంస్కృతి అనేవి భారతీయ జీవన విధానంలో వేల సంవత్సరాలుగా పెనవేసుకొని ఉన్నాయి. నిత్యజీవితంలో పెళ్లి, పండుగలు, వృత్తులు, వ్యాపారం, రాజకీయాలు కులంతో ముడిపడి ఉన్నవే. ఈ కులాలు వర్ణ వ్యవస్థ చట్రంలో ఉన్నత, నిమ్న భావాలతో అమర్చబడినవే. విద్యకు నోచుకొనక సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వేల సంవత్సరాలుగా అణగదొక్కబడిన ఈ వర్గాలు భారత రాజ్యాంగం ప్రసాదించిన సామాజిక ఆర్థిక, రాజకీయ, న్యాయాలను అందుకోవాలంటే ప్రత్యేక రక్షణలు అవసరము. అందుకే వీరికి ప్రత్యేకoగ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అవసరం. అప్పుడే వీరికి సామాజిక న్యాయం అందుతుంది.
2. *రాజ్యాంగపరమైన న్యాయపరమైన అవసరము:* – రాజ్యాంగము నిర్దేశించిన ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు అమలు కావాలంటే సమగ్ర కుల గణన అవసరము. రాజ్యాంగపరమైన విద్యా ,ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పొందాలంటే కుల గణన అవసరము. నిజానికి భారత రాజ్యాంగము ఆర్టికల్ 15 (4) లో సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతులని పేర్కొనటం జరిగింది. వెనుకబడిన తరగతులను గుర్తించాలి అంటే కులమే ప్రధాన ప్రామాణికమని సుప్రీంకోర్టు, కాక కాలేకర్, మండల్ కమిషన్లు నొక్కి చెప్పడం జరిగింది. రిజర్వేషన్ల పెంపు, అమలు విషయంపై ఓబిసి కులాల లెక్కలు లేకపోవడం వలన అనేకసార్లు బిసిలకు సంబంధించిన కేసులు ఓడిపోవడం జరిగింది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 343 ఏ(3) ప్రకారము రాష్ట్రాలు వెనుకబడిన తరగతుల జాబితాను తయారు చేయవలసి ఉంది. ఆ జాబితాను విద్య, ఉద్యోగ ,స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కొరకు వినియోగించు కోవచ్చును. కేంద్రం కూడా తమ సొంత ఓబిసి కులాల జాబితాను ఆర్టికల్ 342 ఏ(1) ప్రకారము రాష్ట్రాల వారీగా తయారు చేసుకోవచ్చును.
3. *ఇది పరిపాలనాపరమైన అవసరము:* – కులాల వారిగా సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ప్రతిబింబించే జనాభా లెక్కలు ఉన్నప్పుడే అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందించే వీలు ఏర్పడుతుంది. వారి అభివృద్ధికి తగు ప్రణాళికలు రచించవచ్చును. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుంది. బిసి కులాలను ఉప కులాలుగా విభజించటం వీలు అవుతుంది. క్రిమిలేయర్ ను కూడా సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 1948 జనాభా లెక్కల చట్టంలో ఓబిసి కులాల జాబితాను చేర్చి ఎస్సీ ఎస్టీ కులాల వారి లాగానే ఓబీసీల జనాభ లెక్కలు సేకరించ వచ్చును . అలాగే రాష్ట్రాలు కలెక్షన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2008 చట్ట ప్రకారం కుల గణన చేపట్ట వచ్చును. పాట్నా (బీహార్) హైకోర్టు రాష్ట్రాలకు కుల గణన చేసే అధికారం ఉంది అని తీర్పు ఇవ్వడం జరిగింది.
4. *సబ్బండ వర్గాల అభివృద్ధికి అవసరము:* – వెనుకబడిన వర్గాల లెక్కలే కాకుండా అభివృద్ధి చెందిన వారి లెక్కలు కూడా తీయాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన (అగ్రవర్ణాల) 10 శాతం రిజర్వేషన్లు కూడా సమర్థవంతంగా అమలు చేయవచ్చును.
5. *నైతిక అవసరం:* – ఒక సమాజం యొక్క మానవీయత ఆ సమాజం బడుగు బలహీన వర్గాలకు కల్పించిన ప్రత్యేక రక్షణ లపై ఆధారపడి ఉంటుంది. మరి వేల సంవత్సరాలుగా వివక్షతకు గురైన ఈ వర్గాలకు ప్రత్యేకoగ రిజర్వేషన్ రక్షణలు కల్పించవలసిన నైతిక బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
*కుల గణనను కొందరు వ్యతిరేకిస్తున్నారు ,ఎందుకంటే?*
1. కుల గణన వలన దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలుగుతుంది, ప్రజల మధ్య వైశమ్యాలు ఏర్పడతాయి, ప్రజలు విభజింపబడతారు అని.
నిజానికి భారతీయ సమాజం మూడు వేల సంవత్సరాల క్రితమే కులాల వారిగ ప్రజలను విభజించింది. ఇందులో కొత్తగా విభజించేది ఏమి లేదు. అదేవిధంగా దేశంలో జనాభా లెక్కలు సేకరించే టప్పుడు మతం, ప్రాంతం, భాష విషయాలు సేకరిస్తాం . మతం, భాష, ప్రాంతం విషయాల సేకరణ వలన దేశ సమగ్రతకు సమైక్యతకు భంగం కలుగదా? కేవలం ఓబిసి కుల గణన వల్లనే వైషమ్యాలు పెరుగుతాయని, దేశ సమగ్రతకు భంగం కలుగుతుందని చెప్పడం విడ్డూరం. అలాగే జనాభా లెక్కలలో 1234 యస్సి కులాలు, 698 ఎస్టి కులాల లెక్కలు తీస్తున్నాము మరి కేవలం 4000ల ఓబీసీ కులాల లెక్కలు తీయడం వలన మాత్రమే దేశ సమగ్రతకు భంగం కలుగుతుంద ?మరి మనము ఇప్పుడు ఎందుకు తీయకూడదు.
2. *కుల గణన వలన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ పెరుగుతుంది* – ఇది కూడా వాస్తవము కాదు కులాల వారీగా జనాభా లెక్కల వలన అత్యంత వెనుకబడిన వారిని సులభంగా గుర్తించవచ్చును వారికి రిజర్వేషన్లు సమర్థవంతంగా అందించవచ్చును .అభివృద్ధి చెందిన వర్గాల రిజర్వేషన్ల డిమాండ్ సమర్థవంతంగా ఎదుర్కొన వచ్చును. రాష్ట్ర ప్రభుత్వములు తమ ఓటు బ్యాంకు కొరకు కొన్ని అభివృద్ధి చెందిన కులాలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడాన్ని సమర్థవంతంగా అడ్డుకోవచ్చును. వెనుకబడిన వర్గాల న్యాయపరమైన రిజర్వేషన్ల పెంపు డిమాండును పరిశీలించి చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవచ్చును.
3. *బిసి కుల గణన సంక్లిష్టమైనది* సుప్రీం కోర్టులో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ .ఇది పూర్తిగా వాస్తవానికి విరుద్ధం . ఓబిసి లు తమ కులమును చెప్పుకోలేనంత వెనుకబడి ఏమి లేరు. 1234 ఎస్సీ కులాలు ,698 ఎస్టి కులాల జనాభా లెక్కలు తీయగలిగినప్పుడు 2633 ఓబిసి కులాలు సుమారు 4000 రాష్ట్ర బీసీ కులాల జనాభా లెక్కలకు ఇబ్బంది ఏమి కాదు. ఎలాంటి సాంకేతిక ,రవాణా ,కమ్యూనికేషన్ సౌకర్యములు లేనప్పుడు ,ప్రజలు నిరక్షరాస్యులుగా బానిస బతుకులు బతుకుతున్నప్పుడు ,బ్రిటిష్ వారు కుల గణన చేసినప్పుడు ఈ ఆధునిక యుగము లో కుల గణన చేయలేమని చెప్పడం హాస్యాస్పదం. చేయాలనే సంకల్పం ఆదిపత్య కులాల ప్రభుత్వాలకు లేకపోవటమే దీనికి కారణం.
కుల జనగణన వలన మాత్రమే ఓబీసీ కులాలకు సమానత్వం ,సామాజిక న్యాయం అందుతాయి .వారి సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనం తేటతెల్లం అవుతుంది. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచవచ్చు. కుల గణన ఈ దేశానికి ఒక దిశ ,దశ నిర్దేశిస్తుంది. దేశ ప్రగతికి దిక్చూచిగా మారుతుంది. ఓబీసీ లను సబ్ కేటగిరీలుగా చేసి విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించి అట్టడుగునా ఉన్న వారికి అభివృద్ధిఫలాలు అందించే వీలు ఏర్పడుతుంది. పేదరిక నిర్మూలనకు తోడ్పడుతుంది . లేనిచో సామాజిక న్యాయం అందని ద్రాక్ష పండే .సమగ్ర కుల గణననే భారతీయ వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుంది.
ఇప్పటికైనా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోని కులగణన చేయాలి, లేనిచో రా బోయే ఎన్నికలలో బిసి ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.