Social Justice Party India State Youth President Varipalli Anil Kumar




ఈరోజు హైదరాబాద్‌లోని సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో, చామకూరు రాజు అధ్యక్షతన మరియు ఉపాధ్యక్షుడు శ్రీకాంత్,స్టేట్ కో కన్వీనర్ కేవీ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నియామకాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చామకూరు రాజు మాట్లాడుతూ, తెలంగాణ స్టేట్ యూత్ ప్రెసిడెంట్‌గా రాజులకొత్తపల్లి గ్రామానికి చెందిన వరిపల్లి అనిల్ కుమార్‌ను నియమించినట్లు ప్రకటించారు.
వరిపల్లి అనిల్ కుమార్ తన నియామకాన్ని స్వీకరిస్తూ, సోషల్ జస్టిస్ పార్టీ యువతను రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను పరిష్కరించడం తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అన్నారు. తనకు ఈ అవకాశాన్ని కల్పించిన చామకూరు రాజు, శ్రీకాంత్, కె.వి గౌడ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పదవిని సక్రమంగా నిర్వహించి, సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ముందుండి పోరాడతానని ప్రకటించారు. అదేవిధంగా, సమాజంలో ఎవరికైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా కోరారు.