Manchiryal BC community support hyderabad hunger strike | Social Justice Party Of India
కులగణన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోవాలి!*
*హైదరాబాదులో దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు సంఘీభావం!*
*మంచిర్యాలలో బీసీ సంఘాల నిరసన ప్రదర్శన!!*
తేది: 30.08.2024
తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిపిన తర్వాతనే స్ధానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ బీసీ సంఘాల జేయేసి నాయకులు డిమాండు చేసారు. హైదరాబాదులో ఆమరణ దీక్ష చేపట్టిన బీసీ నాయకులకు మద్దతుగా శుక్రవారం రోజున మంచిర్యాల జరిగిన సంఘీభావ ప్రదర్శనలో వారు పాల్గొని ప్రసంగించారు. మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం.. అధికారం లోకి వచ్చిన వెంటనే కుల జనగణన చేస్తామని, BC వర్గాలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన పిదప కుల గణన హామీ ఇప్పటివరకు అమలు జరపలేదు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైందని ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. ఇది ప్రజల కిచ్చిన హామీనిభంగ పరచడమేనని బీసీ నాయకులు విమర్శించారు.
ఇట్టి విషయమై ప్రభుత్వం పునరాలోచన చేసి బీసీ జన గణన సత్వరం చేపట్టాలని బీసీ ఐక్య కార్యాచరణ కమిటి తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణలో కుల జనగణన చేసి బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసిన తరువాతనే స్థానిక సంస్థల పన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాదులో దీక్ష చేస్తున్న బీసీ నాయకులకు ఒప్పించి దీక్ష విరమింపజేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ వడ్డేపల్లి మనోహర్, బీసీ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ బీసీ నాయకులు శ్రీరామోజు కొండయ్య, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు, యువజన సంఘం నాయకులు గద్దెర్ల చంద్రకాంత్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నస్పూరి అఖిల్, అర్కాల ఓదెలు, పద్మశాలి సంఘం నాయకులు నాగరాజు, వేముల మల్లేశం, అడిచర్ల రాజయ్య, సోమన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Supported by : Social Justice Party Of India